A Shared Shadow, A Separate Sun
మన జీవితంలో కొన్నిసార్లు ఊహించని మలుపులు వస్తాయని, వాటికి సమాధానాలు దొరకవని ఆ రోజు నాకు అర్థమైంది. ఒక క్షణం భయం, మరుక్షణం ఆదుర్దా... ఆ పసి హృదయం దారితప్పి ఒక కొత్త స్నేహాన్ని ఎలా తెచ్చిందో . అమ్మ రిక్షా లో వస్తుందేమో అనుకుని బయటకు వెళ్ళిన నా చెల్లి, దారి తప్పి, పిల్లలు లేని ఒక ఆవిడ దగ్గరకు చేరింది. ఆవిడ ప్రేమతో చెల్లిని తీసుకెళ్తున్నప్పుడు నాన్న చూసి, ఆ భయంకరమైన క్షణాన్ని ఒక అద్భుతమైన బంధంగా మార్చారు. చెల్లిని కాపాడిన ఆవిడని నాన్న ఎప్పటికీ మర్చిపోలేదు. చెల్లి కూడా ఆవిడని ప్రేమగా "మేకత్త" అని పిలవడం, ఆవిడ మా ఇద్దరినీ ప్రాణంగా చూసుకోవడం... ఆ బాధ, భయం నుంచి పుట్టిన ఆ బంధం ఒక గొప్ప ఆశీర్వాదం. ఒక కొత్త ప్రపంచం: హిరమండలం ఆ సంఘటన తర్వాత, మన కథ హిరమండలంలో మొదలైంది. ఒక కొత్త ప్రదేశం, కొత్త మనుషులు. ఇంతవరకు చూడని పెద్ద బంగ్లా లాంటి ఇంట్లో, ఇంటి ముందు పెద్ద మామిడి చెట్టు కింద, ఇంటి పక్కన విశాలమైన ఆడుకునే స్థలంలో మా జీవితం మొదలైంది. అక్కడ నాన్న అంటే అందరికీ గౌరవమే కాదు, ఎనలేని భయం కూడా. ఒక నాయకుడిలా ఆయన మాటంటే అక్కడ శాసనం. మా చదువు విషయంలో నాన్న ఎప్పుడూ రాజీపడలేదు. ఉత్తమమైనది ఇవ్వాలని రె...