Posts

A Flash of Light, A Lifetime of Void

Image
                                   నేను, నా చెల్లి... మా మధ్య దాపరికాలు లేని లోకం అది. ప్రతీ సంతోషం, ప్రతీ బాధ... ముందుగా పంచుకునేది నాతోనే. నా దృష్టిలో తను కేవలం చెల్లి కాదు, నా మొదటి బిడ్డ! తనని అంతలా ప్రేమగా చూసుకునేదానిని. పెళ్లైన మూడేళ్లకు తను  Pregnant అని నిర్ధారణ అయిన  రోజు, మా ఆనందానికి హద్దులు లేవు. ఆ పసిబిడ్డ కోసం తను ఎంతగానో కలలు కంది! Pregnancy సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల నుండి, బిడ్డను ఎలా పెంచాలి అనే వరకూ... ప్రతీ క్షణాన్ని, బేబీ కిక్స్‌తో సహా, రికార్డు చేసుకునేది. "బేబీ పెద్దయ్యాక, తన కోసం ఎంత ఎదురుచూశానో చూపిస్తా అక్కా!" అంటూ చెప్పేది. చూస్తుండగానే తొమ్మిది నెలలు పూర్తయ్యాయి. డెలివరీ కోసం నేను ఫ్లైట్‌లో బయలుదేరి, నాన్నతో కలిసి హాస్పిటల్‌కి వెళ్తుంటే... దారిపొడవునా ప్రతి దేవుడినీ వేడుకున్నాం. ముఖ్యంగా, నాన్న.. డెలివరీ హాయిగా జరగాలని, తన కూతురు క్షేమంగా ఉండాలని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూనే ఉన్నారు. కూతుళ్ళంటే ఆయనకు అంత పిచ్చి ప్రేమ. నేను హాస్పిటల్‌ చేరుకోగానే, కేవలం...

A Father's Love, A Hidden Truth

Image
  నా జీవితంలో అమ్మ కన్నా నాన్నే సర్వస్వం. నా ప్రతి ఆలోచన, నా ప్రతి చిన్న విజయం... మొదట పంచుకునేది నాన్నతోనే. ఆయనతో ఒక్క రోజు మాట్లాడకపోయినా, నా మనసు స్థిమితంగా ఉండేది కాదు. 'నాన్నకి ఏమైనా అవుతుందేమో' అనే చిన్న ఊహ కూడా నా గుండెను పిండేసేది. అలాంటిది... నేను కాలేజీలో ఉండగా, నాన్న నాతో మూడు రోజులు మాట్లాడలేదు! ఫోన్ చేసినా, అమ్మ 'నాన్న బిజీగా ఉన్నారు' అనే మాట ఒక్కటే చెప్పేది. నాన్న ఎంత బిజీగా ఉన్నా, ఒక్క మాటైనా మాట్లాడకుండా ఉండరు. నా గుండెలో అప్పటికప్పుడే ఒక తెలియని భయం మొదలైంది. అనుమానం... ఆందోళన... ఇంటికి పరుగు! నా మనసు ఎంతకీ ఒప్పుకోలేదు. నాకు హాలిడేస్ ఉన్నాయని అబద్ధం చెప్పి, టికెట్ బుక్ చేసుకున్నాను. "ఇప్పుడెందుకమ్మా? మొన్ననే కదా వెళ్లావు?" అని అమ్మ  అడిగింది. అంతలోనే, నాతో ఎప్పుడూ సరదాగా ఉండే నానమ్మ, ఫోన్‌లో వేదాంతాలు మాట్లాడటం మొదలుపెట్టింది. అప్పుడే నాకు అర్థమైంది.ఇంట్లో ఏదో జరుగుతోంది! నాకు అంతా షేర్ చేసుకునే నా  చెల్లి కూడా ఈ విషయాన్ని ఎందుకు దాచిందో అర్థం కాలేదు. గంట గంటకు పెరుగుతున్న ఆందోళన, 'నాన్నకి ఏమీ కాకూడదు' అనే భయం నాలో ప్రయాణమంతా వెంటాడింద...

The Golden Years of College Days

Image
  ఆ కబుర్లు, ఆ నవ్వులు... కళాశాల కబుర్లు! అవును, నాన్న అన్న మాట అక్షరాలా నిజం. జీవితంలో అత్యంత అద్భుతమైన రోజులు అంటే అవే... ఈ కాలేజీ రోజులే! ఇంటికి దూరంగా ఉన్నా, ఇక్కడ దొరికే కొత్త స్నేహాలు, మర్మం లేని ఆత్మీయతలు... వాటికి వెల కట్టలేం. రూమ్మేట్స్‌తో తొలి రోజుల్లో కొద్దిగా బిడియంగా మొదలై, ఆ తర్వాత ఒక్క క్షణం కూడా విడిగా ఉండలేనంతటి 'జై-వీరూ' బంధం ఏర్పడటం ఎంత అపురూపం! నిజంగా, మనతో పాటు మన ఎదుగుదలను కోరుకునే కొద్ది మంది బెస్ట్ ఫ్రెండ్స్‌ను సంపాదించుకోవడమే కాలేజీ జీవితం ఇచ్చే అతిపెద్ద బహుమతి. చూస్తుండగానే, ఫ్రెషర్స్ డే హంగామా ముగిసింది, ఆపై తెలియని టెన్షన్‌తో సెమిస్టర్ పరీక్షలు కూడా గడిచిపోయాయి. సెలవులు... అమ్మ చేతి వంట, చెల్లి కబుర్లు! మొదటి సంవత్సరం పూర్తి కాగానే, సెలవుల కోసం ఇంటికి వెళ్లడం ఒక పండుగలా ఉండేది. హాస్టల్ గేటు దాటగానే, "నా బిడ్డ వస్తోంది!" అని అమ్మ కళ్లలో దాగిన ఆనందం! ఇంటికి చేరుకునేసరికి నాకిష్టమైన వంటకాలతో స్వాగతం పలకడం, ఆ రుచి... ఆహా! హాస్టల్ మెస్ జ్ఞాపకాలన్నిటినీ ఒక్క దెబ్బతో మాయం చేసేది. ఇక చెల్లితో కబుర్లు! రాత్రంతా ఇద్దరం ఎంత మాట్లాడేవాళ్లమో! "అక్క...

When Life Takes a New Turn

Image
 నానమ్మ కన్నీళ్లు: హాస్టల్ గోడల వెనుక శ్రీకాకుళం రోజులు ముగియగానే, నా చదువుల ప్రయాణం వేరే మలుపు తీసుకుంది. EAMCET రాసి, కౌన్సెలింగ్‌లో సీటు కోసం నాన్నతో కలిసి ఎదురుచూసిన క్షణాలు అవి. ఎట్టకేలకు, నాన్న, నేను కలిసి తీసుకున్న ఆ కీలక నిర్ణయం, ఇంటికి చాలా దూరంగా ఉన్న ఒక యూనివర్సిటీలో చేరడం. అది కేవలం చదువు కోసం కాదు, నాన్న దృష్టిలో అది నా భవిష్యత్తుకు వేయబోతున్న బలమైన పునాది. ఆ రోజు నా జీవితంలో మరో  వీడ్కోలు. స్కూల్ గేటు దగ్గర భయంతో నేను ఏడ్చినప్పుడు నాన్న గుండె కరిగింది. కానీ, ఈసారి నా భవిష్యత్తు కోసం ఆ వేదనను భరించక తప్పలేదు. నాన్న, అమ్మ నన్ను హాస్టల్‌లో వదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ రోజు మా అందరికన్నా ఎక్కువ బాధపడింది నానమ్మ. నన్ను  గట్టిగా పట్టుకుని, నానమ్మ  ఏడ్చింది. "అంత దూరం ఎందుకురా పంపిస్తున్నారు? చిన్నపిల్ల... ఒంటరిగా ఎలా ఉంటుంది?" అంటూ కన్నీళ్లతో నాన్నను బతిమాలింది. ఆ ముఖంపై కనిపించిన నిస్సత్తువ నా గుండెను దహించింది. నానమ్మ కళ్ళలో నేను చూసిన ఆ నిస్వార్థ ప్రేమ నన్ను హాస్టల్ గోడల మధ్య కూడా వెంటాడే ఒక దీపమైంది. నాకంటే ఎక్కువ కుంగిపోయింది చెల్లి. నేను దూరమవ...

A Shared Shadow, A Separate Sun

Image
మన జీవితంలో కొన్నిసార్లు ఊహించని మలుపులు వస్తాయని, వాటికి సమాధానాలు దొరకవని ఆ రోజు నాకు అర్థమైంది. ఒక క్షణం భయం, మరుక్షణం ఆదుర్దా... ఆ పసి హృదయం దారితప్పి ఒక కొత్త స్నేహాన్ని ఎలా తెచ్చిందో . అమ్మ రిక్షా లో వస్తుందేమో అనుకుని బయటకు వెళ్ళిన నా చెల్లి, దారి తప్పి, పిల్లలు లేని ఒక ఆవిడ దగ్గరకు చేరింది. ఆవిడ ప్రేమతో చెల్లిని తీసుకెళ్తున్నప్పుడు నాన్న చూసి, ఆ భయంకరమైన క్షణాన్ని ఒక అద్భుతమైన బంధంగా మార్చారు. చెల్లిని కాపాడిన ఆవిడని నాన్న ఎప్పటికీ మర్చిపోలేదు. చెల్లి కూడా ఆవిడని ప్రేమగా "మేకత్త" అని పిలవడం, ఆవిడ మా ఇద్దరినీ ప్రాణంగా చూసుకోవడం... ఆ బాధ, భయం నుంచి పుట్టిన ఆ బంధం ఒక గొప్ప ఆశీర్వాదం. ఒక కొత్త ప్రపంచం: హిరమండలం ఆ సంఘటన తర్వాత, మన కథ హిరమండలంలో మొదలైంది. ఒక కొత్త ప్రదేశం, కొత్త మనుషులు. ఇంతవరకు చూడని పెద్ద బంగ్లా లాంటి ఇంట్లో, ఇంటి ముందు పెద్ద మామిడి చెట్టు కింద, ఇంటి పక్కన విశాలమైన ఆడుకునే స్థలంలో మా జీవితం మొదలైంది. అక్కడ నాన్న అంటే అందరికీ గౌరవమే కాదు, ఎనలేని భయం కూడా. ఒక నాయకుడిలా ఆయన మాటంటే అక్కడ శాసనం. మా చదువు విషయంలో నాన్న ఎప్పుడూ రాజీపడలేదు. ఉత్తమమైనది ఇవ్వాలని రె...

The Beginning Of our Story- Journey of our footsteps 👣

Image
  మన బాల్యం మొదలైన ఊరు — ఆమదాలవలస     ఆ పేరు వినగానే నా పెదాలపై ఒక చిరునవ్వు, గుండె లోపల ఒక లోతైన భావన. ఆ ఊరి మట్టి రోడ్లు, వాటి పక్కన ఉండే పచ్చని చెట్లు... ఇవన్నీ కేవలం మట్టి కాదు, అవి మన చిన్ననాటి అడుగుజాడలు.    నువ్వు, నేను.. మన జీవితాల్లోకి వచ్చిన అపురూపమైన,అమాయకమైన మనుషులు  . వాళ్ళు మనపై చూపించిన మమకారం, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేనివి. నాన్న ఎప్పుడూ చెప్పేవారు,ప్రతి బంధం రక్తం తోనే కాదు కొన్ని బంధాలు మనసులతో ముడిపడి కూడా ఉంటాయి అని ఆయన ఆ మాట ఎందుకు అన్నారో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇప్పటి కాలం లో ఇలాంటి బంధాలు చాలా  అరుదు.  దివ్యా, నీకు గుర్తుందా? మన బాల్యం ఎంత స్వచ్ఛంగా, ఎంత అద్భుతంగా గడిచిందో!  మన చిన్ననాటి స్కూల్ బంక్ ప్రణాళికలు అంటే... అవి కేవలం క్లాస్ ఎగ్గొట్టడం కోసం కాదు, అవి నువ్వు,నేను   కలిసి చేసిన అతి పెద్ద అల్లరి. ప్రతి ఉదయం స్కూల్‌కి బయలుదేరేటప్పుడు నువ్వు నా చేతిని పట్టుకుని అడిగే ఆ ఒక్క ప్రశ్న... "అక్కా, నువ్వు నాతోనే వస్తావు కదా?" ఆ మాటల్లో ఉన్న భయం కన్నా, నాపై నువ్వు ఉంచిన నమ్మకం నాకు బాగా గుర్...

Two Blossoms, One Root

Image
    1993, సెప్టెంబర్ 30.   తీవ్రమైన మౌనం మధ్యలో భూమి కంపించింది .  లతూర్ భూకంపం అని వార్తలు వచ్చాయి కాసేపటికి .  కానీ మా ఇంట్లో …  అదే తెల్లవారుజామున 1: ౩౦ నిమిషాలకి ,  ఒక్క చిన్న పాదం భూమ్మీద పడింది . అది భూమిని తాకిన చప్పుడు కాదు .  అది మా జీవితాల్లో తిరుగులేని మార్పు వేసిన తొలి నినాదం .  అది నువ్వు – నా చెల్లి ** దివ్య భారతి **.   అది నీవు పుట్టిన రోజు .. నా చెల్లి , నా ప్రాణం , నా దివ్య .  అప్పటి నుంచి నా గుండెలో పుట్టిన మొదటి ధ్వని నీవే .. నీవే నా హృదయధ్వని .   నువ్వు జన్మించినప్పుడు ఏడవలేదు అనడం కంటే …  ప్రపంచాన్ని చూస్తూ , “ ఈ జీవితం ఎంత అందమైంది ” అని ఆశ్చర్యపోయినట్టు కనిపించావు ఏమో అనిపిస్తుంది నాన్న మాటలు వింటుంటే .  " కొడితేనే    ఏడ్చింది , అది కూడా ఒక్కసారి !" అంటారు   నాన్న .  చిన్నగా చూసి నవ్వింది కూడా కావచ్చు – కానీ ఆ నవ్వు మా జీవితాల్ని మార్చేసింది .     ...