A Father's Love, A Hidden Truth

 


నా జీవితంలో అమ్మ కన్నా నాన్నే సర్వస్వం. నా ప్రతి ఆలోచన, నా ప్రతి చిన్న విజయం... మొదట పంచుకునేది నాన్నతోనే. ఆయనతో ఒక్క రోజు మాట్లాడకపోయినా, నా మనసు స్థిమితంగా ఉండేది కాదు. 'నాన్నకి ఏమైనా అవుతుందేమో' అనే చిన్న ఊహ కూడా నా గుండెను పిండేసేది.

అలాంటిది... నేను కాలేజీలో ఉండగా, నాన్న నాతో మూడు రోజులు మాట్లాడలేదు!

ఫోన్ చేసినా, అమ్మ 'నాన్న బిజీగా ఉన్నారు' అనే మాట ఒక్కటే చెప్పేది. నాన్న ఎంత బిజీగా ఉన్నా, ఒక్క మాటైనా మాట్లాడకుండా ఉండరు. నా గుండెలో అప్పటికప్పుడే ఒక తెలియని భయం మొదలైంది.

అనుమానం... ఆందోళన... ఇంటికి పరుగు!

నా మనసు ఎంతకీ ఒప్పుకోలేదు. నాకు హాలిడేస్ ఉన్నాయని అబద్ధం చెప్పి, టికెట్ బుక్ చేసుకున్నాను. "ఇప్పుడెందుకమ్మా? మొన్ననే కదా వెళ్లావు?" అని అమ్మ  అడిగింది. అంతలోనే, నాతో ఎప్పుడూ సరదాగా ఉండే నానమ్మ, ఫోన్‌లో వేదాంతాలు మాట్లాడటం మొదలుపెట్టింది. అప్పుడే నాకు అర్థమైంది.ఇంట్లో ఏదో జరుగుతోంది!

నాకు అంతా షేర్ చేసుకునే నా  చెల్లి కూడా ఈ విషయాన్ని ఎందుకు దాచిందో అర్థం కాలేదు. గంట గంటకు పెరుగుతున్న ఆందోళన, 'నాన్నకి ఏమీ కాకూడదు' అనే భయం నాలో ప్రయాణమంతా వెంటాడింది.

రైల్వే స్టేషన్ చేరుకున్నాను. నన్ను పికప్ చేసుకోవడానికి ఎప్పుడూ వచ్చే నాన్న రాలేదు. అమ్మ, చెల్లి మాత్రమే వచ్చారు. "డాడీ ఎక్కడ?" అని అడిగితే, "ఆఫీసులో పని ఉంది" అని అమ్మ ముఖం పక్కకు తిప్పేసుకుంది.

నాన్న ని అలా  చూడలేకపోయా!

సరే అనుకుని ఇంటికి వెళ్తున్నాను. నా గుండె ఎప్పుడూ లేనంత గట్టిగా కొట్టుకుంటోంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే... ఆ దృశ్యం చూసి నా కాళ్లు అక్కడే ఆగిపోయాయి.

డాడీ కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆయన బలహీనంగా కనిపించారు. ముఖ్యంగా... ఆయన చేతికి కట్టిన పెద్ద బ్యాండేజీ మరియు పక్కనే ఉన్న పెద్ద టాబ్లెట్ల బాక్స్!

నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏడుస్తూ నాన్న దగ్గరకి పరిగెత్తాను. "ఏమైంది నాన్నా!?" అని అడిగాను.

నాన్న మెల్లగా నా చేయి పట్టుకుని, నన్ను తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ క్షణం నాన్న కళ్లల్లో నేను చూసిన బాధ... అది కేవలం అనారోగ్యపు బాధ కాదు, కూతురి నుండి నిజాన్ని దాచిపెడుతున్న ఆవేదన!

"అమ్మా... నీకు మేము అబద్ధం చెప్పిన ప్రతిసారీ, మేము నీకంటే ఎక్కువ బాధపడ్డాం.మేము అంత ఇక్కడ కలిసి ఉన్నాం కానీ నువ్వు హాస్టల్ లో ఒంటరి గా ఉన్నావు అందుకే నువ్వు ఎక్కడ భయపడి భాదపడిపోతావో అని నీకు చెప్పలేదు అందుకే, నీకు ఈ కష్టాన్ని తెలియకుండా కాపాడాలనుకున్నాం" అని నాన్న చెప్పారు .

అప్పుడే నానమ్మ చెప్పింది నాన్నకి షుగర్ అటాక్ వచ్చి మూడు రోజులు హాస్పిటల్‌లో ఉన్నారు.

ఆ నిజం వినగానే నా కళ్ళల్లో కన్నీళ్లు జలజలా రాలాయి. నాన్న నన్ను గట్టిగా హత్తుకుని, "ఏమీ కాలేదమ్మా" అని ఓదార్చారు. అప్పుడు నాకు అర్థమైంది... జీవితంలో ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మన కష్టాన్ని మన నుంచి దాచి, మన సంతోషాన్ని కాపాడటానికి ప్రయత్నించే త్యాగమే నిజమైన ప్రేమ అని!

మేము ఎంచుకున్న ప్రేమ పెళ్లిళ్లు అవి వారికి మాపై ఉన్న నమ్మకాన్ని, మా సంతోషాన్ని ఎంతగా కోరుకున్నారో నిరూపించాయి. 

వారు ఎన్ని బాధలు, కష్టాలు అనుభవిస్తున్నా, అవి ఏవీ మా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ, ఆ నవ్వులతోనే మాపై ఉన్న మమకారాన్ని చూపేవారు. మా పెళ్లి వేడుకల్లో, ఎక్కడా ఏ చిన్న లోటు రాకుండా, వారు పడిన కష్టాన్ని మర్చిపోయేలా, అత్యంత ఆడంబరంగా చేశారు. ఆ వైభవం వెనుక, మా భవిష్యత్తు కోసం వారు చేసిన  త్యాగం దాగి ఉంది.

అయితే, మా ఆనందం... ఆ సంతోషం... అది బహుశా ప్రకృతికి కూడా నచ్చలేదేమో!

మా ప్రేమలోని అందాన్ని, మా కుటుంబంలోని అనుబంధాన్ని చూసి... భగవంతుడికి కూడా కన్ను కుట్టిందేమో!

అందుకే... మా జీవితాన్ని చుట్టుముట్టిన ఆ సంతోషాల సూర్యుడిని ఒక్కసారిగా కబళించినట్లుగా... మా జీవితం లో శూన్యం నీలిమేఘాలు నల్లగా కమ్ముకున్నాయి!  

కుటుంబంలో ఎవరికైనా ఏదైనా అవుతుందనే ఊహ కూడా మన వెన్నులో వణుకు పుట్టిస్తుంది.

ఈ కథ రాయడానికి అసలు కారణం ...  

నేను ఈ కథను ప్రారంభించడానికి గల కారణం ఇదే! మన జీవితంలో అనుకోని సందర్భాలు ఎదురైనప్పుడే, ఎవరు మనవాళ్ళు మరియు ఎవరు కాదు అనేది అర్థమవుతుంది. ఆ కష్టకాలంలో మన పక్కన నిలబడేవారే నిజమైన బంధువులు.

ఆలా నా జీవితంలో మొదలైన...

ఈ సంఘటన నా జీవితాన్ని, నేను ప్రపంచాన్ని చూసే కోణాన్ని పూర్తిగా మార్చేసింది. 

తన కథ బయటకు రావాలి, తన గురించి లోకానికి తెలియాలి అనే బలమైన సంకల్పమే ఈ ప్రయాణానికి పునాది.ఆ కథ మీతో  పంచుకోవడానికి వచ్చేవారం నుండి తన కోసం తన జ్ఞాపకాలలో మిగిలిన నేను.

Comments

Popular posts from this blog

Two Blossoms, One Root

The Beginning Of our Story- Journey of our footsteps 👣

A Flash of Light, A Lifetime of Void