The Golden Years of College Days

 

ఆ కబుర్లు, ఆ నవ్వులు... కళాశాల కబుర్లు!

అవును, నాన్న అన్న మాట అక్షరాలా నిజం. జీవితంలో అత్యంత అద్భుతమైన రోజులు అంటే అవే... ఈ కాలేజీ రోజులే! ఇంటికి దూరంగా ఉన్నా, ఇక్కడ దొరికే కొత్త స్నేహాలు, మర్మం లేని ఆత్మీయతలు... వాటికి వెల కట్టలేం. రూమ్మేట్స్‌తో తొలి రోజుల్లో కొద్దిగా బిడియంగా మొదలై, ఆ తర్వాత ఒక్క క్షణం కూడా విడిగా ఉండలేనంతటి 'జై-వీరూ' బంధం ఏర్పడటం ఎంత అపురూపం!

నిజంగా, మనతో పాటు మన ఎదుగుదలను కోరుకునే కొద్ది మంది బెస్ట్ ఫ్రెండ్స్‌ను సంపాదించుకోవడమే కాలేజీ జీవితం ఇచ్చే అతిపెద్ద బహుమతి. చూస్తుండగానే, ఫ్రెషర్స్ డే హంగామా ముగిసింది, ఆపై తెలియని టెన్షన్‌తో సెమిస్టర్ పరీక్షలు కూడా గడిచిపోయాయి.

సెలవులు... అమ్మ చేతి వంట, చెల్లి కబుర్లు!

మొదటి సంవత్సరం పూర్తి కాగానే, సెలవుల కోసం ఇంటికి వెళ్లడం ఒక పండుగలా ఉండేది. హాస్టల్ గేటు దాటగానే, "నా బిడ్డ వస్తోంది!" అని అమ్మ కళ్లలో దాగిన ఆనందం! ఇంటికి చేరుకునేసరికి నాకిష్టమైన వంటకాలతో స్వాగతం పలకడం, ఆ రుచి... ఆహా! హాస్టల్ మెస్ జ్ఞాపకాలన్నిటినీ ఒక్క దెబ్బతో మాయం చేసేది.

ఇక చెల్లితో కబుర్లు! రాత్రంతా ఇద్దరం ఎంత మాట్లాడేవాళ్లమో! "అక్కా, నువ్వు లేకపోతే నేను ఎంత మిస్సయ్యానో తెలుసా?" అని ఆప్యాయంగా చెప్పే మాటలు... తను నన్ను మిస్ అయిన దాని కంటే నేనే తనను ఎక్కువగా మిస్సయ్యానని నా గుండె చెప్పేది. ఆ కబుర్లలో మా మధ్య దూరం, హాస్టల్ బాధ అంతా మాయం!

తిరిగి హాస్టల్‌కి వెళ్లేటప్పుడు... ఆ తెలియని బాధ! బస్సు ఎక్కేంతవరకు అమ్మానాన్నల కళ్లల్లోని ప్రేమ, చెల్లి కళ్లల్లోని కన్నీళ్లు... అన్నీ గుండెను పిండేసేవి. "అంతా ఇంట్లో మనుషులకి, పిల్లలకి ఉండే మామూలు బాధే!" అని సర్ది చెప్పుకుని కదిలేవాళ్లం.

రూమ్మేట్స్.. సీనియర్ల కహానీ!

రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టడం అంటేనే ఒక థ్రిల్! ఎందుకంటే, ఇప్పుడు మనం సీనియర్లం! "ఏయ్! మన రూమ్మేట్స్ ఎంత క్లోజ్ అయ్యామో చూడు, మనం ఒక ఫ్యామిలీ అయిపోయాం!" అని మురిసిపోయేవాళ్లం.

జోక్స్, కొత్త సినిమాల గోల, లంచ్ బాక్స్‌లు మార్చుకోవడం, గ్రూప్ స్టడీ పేరుతో అర్ధరాత్రి దాకా కబుర్లు చెప్పుకోవడం... ఇవన్నీ జీవితంలో మళ్లీ దొరకని మధురానుభూతులు. ఓ రోజు రాత్రి లైట్స్ ఆఫ్ చేసి, ఒకే బెడ్‌పై అందరం దూరి, భయంకరమైన దెయ్యం కథలు చెప్పుకుని, ఆ తర్వాత భయంతో ఒకరినొకరు హత్తుకుని నిద్రపోయే ఆ అనుభూతి...

ఆ మౌనం గుండెల్లో ఒక బరువైన రాయిలా కూర్చుంది. నా చుట్టూ ఉన్న ప్రతి చిరునవ్వు వెనుక ఒక కన్నీటి కథ దాగి ఉన్నట్టుగా అనిపిస్తోంది. ముఖ్యంగా, నా చెల్లి కళ్ళల్లోని ఆ నిగూఢమైన ఆవేదన! అది కేవలం నా కోసమే ఎదురుచూసే అమాయకత్వం కాదు. ఆ మెరుపులో ఏదో తెలియని భయం, ఒక వేదన దాగి ఉన్నాయి అని అర్ధం అవుతుంది .

'అమ్మ' వస్తోంది... మా రూమ్‌కి పిండివంటల జాతర!

కానీ, అసలైన పండగ ఎప్పుడు వచ్చేదంటే... మా రూమ్మేట్స్‌లో ఎవరి తల్లిదండ్రులు వస్తున్నారని తెలిసినప్పుడే! ఆ రోజు, మా రూమ్ మొత్తం ఒక చిన్న ఫుడ్ కోర్ట్ అయిపోయేది.

"మా అమ్మ తెచ్చే చికెన్ పచ్చడి రుచి తెలుసా మీకు?" అని ఒకరు, "మా ఇంట్లో చేసే ప్రాన్స్ కర్రీ తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!" అని మరొకరు... వంగీ బాత్, పూరి, స్వీట్లు, కారప్పూస, అప్పాలు... చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ అంతా ఒక ప్రేమ పండుగ!

ఆ తల్లిదండ్రులు కూడా ఎంత గొప్పవాళ్ళంటే! "మా అమ్మాయికి ఎంత పెడుతున్నారో, మీకూ అంతే పెట్టాలి" అంటూ, ఏమాత్రం తేడా చూపకుండా మమ్మల్ని కూడా వాళ్ళ కూతుళ్లతో సమానంగా చూసుకునేవారు. ఆ తల్లిదండ్రుల ప్రేమలో ఆ మెస్ బాధలన్నీ మాయం!

నెలకో 'తల్లి' ప్రేమతో...

అసలు అంతకంటే అద్భుతమైన ఆలోచన ఏంటంటే... మంత్లీ ఒకరు రావాలని మాట్లాడుకుని, నెలకొక 'మదర్' మా రూమ్‌కి రావడం! ఒక అమ్మ వచ్చి కొన్ని రోజులు మాతో ఉండిపోవడం... ఆమె చేతి వంట, ఆమె ఆప్యాయత, ఆమె కబుర్లు... ఆ కొన్ని రోజులు మా రూమ్ మొత్తం ఇంటి వాతావరణాన్ని మోసుకొచ్చేది.నా చెల్లి హాస్టల్‌కి వచ్చిన ఆ కొద్ది రోజులు, దాని నవ్వు, దాని అందం చూసి నా ఫ్రెండ్స్ ముగ్ధులైపోవడం, మా రూమ్‌ని అది నిజమైన పండుగలా మార్చేయడం... అన్నీ మధుర జ్ఞాపకాలే

నిజంగా! ఆ రూమ్‌లో ఉండడం అదృష్టం, అంతటి మంచి స్నేహితులను బెస్ట్ ఫ్రెండ్స్‌గా పొందడం అదృష్టం. ఆ తల్లిదండ్రుల ప్రేమ... ఆ మెస్ ఫుడ్ కష్టాలు, ఆ చిన్న చిన్న గొడవలు... అన్నీ ఈ రోజు తలుచుకుంటే కమ్మటి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.

next week to be continued...

ప్రతి రోజు  నా కోసం ఎదురుచూసే నా చెల్లి కళ్ళల్లో ఇప్పుడు ఏముంది? తన ఎదురుచూపు కేవలం నా రాక కోసమేనా, లేక దాని వెనుక నేను అర్థం చేసుకోలేని ఆవేదన ఏదైనా దాగి ఉందా?

అందమైన ఈ మార్పులు నా జీవితంలో మంచి కోసమేనా?

మరి ముఖ్యంగా... నాన్న. నాన్నకు ఏమైంది? నా ప్రియమైన నాన్న కళ్ళల్లో నేను చూడని బాధ ఏమిటి? ఇంట్లో వాళ్ళందరూ, చివరికి నా ప్రాణంలాంటి చెల్లి కూడా, నా నుండి దాచిన ఆ రహస్యం ఏమిటి?

నిజం తెలుసుకున్న క్షణం, నేను తట్టుకోగలనా? 

Comments

Post a Comment

Popular posts from this blog

Two Blossoms, One Root

The Beginning Of our Story- Journey of our footsteps 👣

A Flash of Light, A Lifetime of Void